Fadnavis again helicopter ground

ఫడ్నవీస్కు మళ్లీ హెలికాప్టర్ గండం

Date : 09/12/2017
నాసిక్ (మహారాష్ట్ర) ముచ్చట్లు :
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు అసలు హెలికాప్టర్ అచ్చిరానట్లుంది. మరోసారి ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించడంతో హెలికాప్టర్ను అనూహ్యంగా దించివేశారు. అయితే, హెలికాప్టర్ సురక్షితంగానే దిగిందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ సంఘటన శనివారం ఉదయం 9.30గంటలకు చోటు చేసుకుంది.ముఖ్యమంత్రి సహాయకుడు సంతోష్ బారి తెలిపిన వివరాల ప్రకారం ఫడ్నవీస్ నీటి వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో కలిసి నాసిక్ నుంచి ఔరంగాబాద్కు బయలుదేరారు. తొలుత 50 అడుగులు మాత్రమే ఎగిరిన హెలికాప్టర్ ఆ తర్వాత పైకి లేవలేకపోయింది. దీంతో కొద్ది మీటర్ల దూరంలో హెలికాప్టర్ను సురక్షితంగా దించి వేశారు. పఢ్నవీస్ కోసం సిద్ధం చేసిన వంట వ్యక్తిని, ఓ సంచిని హెలికాప్టర్లో ఎక్కించిన కారణంగానే హెలికాప్టర్ కదలనట్లు గుర్తించి వారిని రోడ్డు మార్గంలో తరలించి మరోసారి హెలికాప్టర్లో ఫడ్నవీస్ వెళ్లారు.
Tags : Fadnavis again helicopter ground

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *