నకిలీ ఫాస్టర్ అరెస్ట్

విశాఖపట్టణం ముచ్చట్లు:
 
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో నకిలీ పాస్టర్ వ్యవహారం బట్టబయలైంది. తెలంగాణకు చెందిన యువతి ఫిర్యాదుతో పాస్టర్ లైంగిక వేధింపులు, రూ.కోట్ల డబ్బు వసూళ్ల బాగోతం కూడా వెలుగులోకి వచ్చింది. దేవుని సేవ పేరుతో డబ్బులను వసూళ్లు చేసి పాయకరరావుపేట శ్రీరాంపూరంలో రూ.2 కోట్లతో భవనం నిర్మించినట్లు పేర్కొంటున్నారు. విజయవాడకు చెందిన పాస్టర్ అనిల్ కుమార్ అలియాస్ ప్రేమ దాసు ప్రేమ స్వరుపి యూట్యూబ్ ఛానెల్‌ను ఏర్పాటు చేసి డబ్బుల వసూళ్ల దందాకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన కింద 30 మంది మహిళలను దేవుని సేవ పేరుతో నగదు వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ యువతిని లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. బాధితులు చాలామంది ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అనంతరం ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆదేశాలతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు పాస్టర్ అనిల్ అలియాస్ ప్రేమ దాసును అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.పాస్టర్ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పేరుతో, సమావేశాల పేరుతో రూ.కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాస్టర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాయకరావు పేట పోలీసులు తెలిపారు. పాస్టర్ పై వెల్లువెత్తుతున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
Tags: Fake Foster Arrest

Natyam ad