అవయవ దానాలు చేసిన బాధిత కుటుంబికులు.

కాకినాడ  ముచ్చట్లు:
అకాల మరణం పొందిన యువతి అవయవ దానానికి ఆ కుటుంబం ముందుకొచ్చింది. దీంతో ఆమె రెండు కిడ్నీలను కాకినాడకు ఒకటి, విశాఖకు మరొకటి తరలించి రెండు నిండు ప్రాణాలను కాపాడారు తూర్పుగోదావరి జిల్లా వైద్యులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వరి ఈ నెల 28వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలైన ఆమె బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు నిర్థారించడంతో.. ఆ యువతి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. యువతికి సంబంధించిన రెండు కిడ్నీల్లో ఒకటి ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా కాకినాడకు చెందిన రామకృష్ణారెడ్డికి అమర్చగా.. రెండో కిడ్నీ విశాఖపట్నం ఆరిలోవలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అవయవాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి.. హైవే మొబైల్ వాహనం, నైట్ పెట్రోలింగ్ సిబ్బందితో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక బందోబస్తు కల్పించారు.
 
Tags:Families of victims who have made organ donations

Natyam ad