కేసీఆర్ మాటలతో రైతులు అగమాగం-ఈటల రాజేందర్
సూర్యాపేట ముచ్చట్లు:
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంగళవారం నాడు భద్రాచలం వెళ్తూ సూర్యాపేటలో ఆగారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ లో 5.50లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం కొనేందుకు కేంద్రం అనుమతి ఇవ్వనుంది. కేసీఆర్ మాటలు విని రైతాంగం అగమైంది. తెలంగాణ పండించిన మెజారిటీ పంట సీడ్ కంపెనీ కొరకు పండించింది తప్ప కేసీఆర్ కొంటాడన్న నమ్మకంతో కాదని అన్నారు.కేసీఆర్ అనాలోచిత ఆలోచన కారణంగా రాష్ట్రంలో కొనుగోళ్ల లో ఆలస్యం అయింది. అకాల వర్షాలతో కల్లాలలోనే ధాన్యం తడిసి కొట్టుకపోతుంది. చరిత్రలో రైతులను ఎవరు శాసించలేదు ఒక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే చెప్పిన పంట వేయాలని రైతులను శాసించారు. కేంద్రం కొంటామని చెప్పిన కేసీఆర్ మాత్రం రైతుల పేరుతో రాజకీయం చేశారు. రాష్ట్రంలో సరైన కొనుగోళ్లు, గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ లేక రైతాంగం అగమైపోయింది. మిల్లులు టోకెన్లు ఇస్తేనే కొనే దుర్భర పరిస్థితి నెలకొంది. న్యూరో చక్రవర్తి పాత్ర పోషించకుండా ప్రగడబాలను వదిలిపెట్టి రైతులు పండించిన పంటలకు సకాలంలో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను, తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి రైతాంగం ఉసురు తప్పదు. ప్రభుత్వం దిగి పోయే లోపు రైతుల పై వేధింపులు మానుకోవాలని ఈటల అన్నారు.
Tags:Farmers Agamagam-Itala Rajender with KCR words

