డివిజన్ పరిధిలోని రైతులు  నీటి తీరువా బకాయిలను తక్షణమే చెల్లించాలి

-అక్రమ లేఅవుట్లు వేస్తే .నిషేదిత జాబితాలో చోటు
-నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
 
నంద్యాల  ముచ్చట్లు:
 
నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని నీటి తీరువా బాకీ ఉన్న రైతులు  బకాయిలను తక్షణమే చెల్లించాలని   నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలియజేశారు. మంగళవారం నంద్యాల సబ్ కలెక్టర్  కార్యాలయంలో సబ్ కలెక్టర్. చాహత్ బాజ్ పాయ్. మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించిన నీటి తీరువా రేట్ల ప్రకారం  తరి మరియు ఆరుతడి భూములకు సంబంధించిన పాత బకాయిలు మరియు ప్రస్తుత బకాయిల మొత్తమును తక్షణమే మీ గ్రామ సచివాలయం నందుగల గ్రామ రెవెన్యూ అధికారి కి  చెల్లించి రసీదు పొందవలసిందిగా తెలిపారు. సదరు బకాయిలను మొత్తం చెల్లించని యెడల చట్టప్రకారం చర్యలు తీసుకోబడుతాయి అని సబ్ కలెక్టర్  తెలియజేశారు. అలాగే అక్రమ లేఅవుట్ల ను గుర్తించడం జరిగిందన్నారు. వారికి తాహశీల్దారు నోటీసులు పంపారు. కానీ వారు పట్టించుకోవడం లేదన్నారు. అటువంటి వారిని రిజిస్ట్రేషన్ నిషేదిత జాబితాలో చేర్చుతామని సబ్ కలెక్టర్ వారు హెచ్చరించారు. కావున తక్షణమే అపరాధ రుసుం చెల్లించి వ్యవసాయ యేత్తర భూమిగా మార్పు చేసుకోవాలని సూచించారు. లేని యెడల కఠినంగా వ్యవహరించాలని తహసీల్దార్ వారికి హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు.
 
Tags: Farmers in the division have to pay the water arrears immediately

Natyam ad