Farmers killed by leopard tiger

చిరుత పులిని చంపిన రైతులు

Date:14/01/2018

ముంబై ముచట్లు:

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రైతులు పెద్ద సాహసమే చేశారు. పొలంలో కట్టివేసిన ఎద్దుపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. కళ్లెదుటే ఎద్దును చంపిన చిరుతను చంపాలని రైతులు నిర్ణయించుకున్నారు. రైతులపై కూడా చిరుత దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. మొత్తానికి చిరుతను రైతులు హతమార్చారు. ఆత్మరక్షణ కోసమే చిరుతను చంపామని గాయపడ్డ రైతులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags: Farmers killed by leopard tiger

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *