పుంగనూరులో పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి -ఏడి లక్ష్మానాయక్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
రైతులు పండించే పంటల విషయంలో వారికి ఆర్‌బికె సిబ్బంది అవగాహన కల్పించి, రైతులను చైతన్యవంతులను చేయాలని శాస్త్రవేత్త రాఘవేంద్రరావు సోమవారం ఏడి లక్ష్మానాయక్‌ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో 6 మండలాలకు చెందిన ఆర్‌బికె సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. కృషి విజ్ఞాన్‌ కేంద్రం శాస్త్రవేత్త రాఘవేంద్ర, జిల్లా వనరుల కేంద్ర అధికారులు పద్మజ, శ్రీనివాసులు, పంటలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ రైతులు సీజన్ల వారిగా పండించే పంటలు, తెగుళ్ల నివారణ, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండ మెళకువలు నేర్పాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలకు అవసరమైన ఎరువులు, మందులు పంపిణీ చేస్తామన్నారు. అలాగే రైతులందరు తాము పండించే పంటలను ఈకెవైసిలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈక్రాప్‌లో నమోదైన వారికి అన్ని విధాల సహాయం అందుతుందన్నారు. ఈ సమావేశంలో ఏవోలు సంధ్య, సుధాకర్‌, మోహన్‌కుమార్‌, జ్యోతమ్మ, రాఖీబా, హేమలత, షణ్ముగం, హబ్‌ఏవో , దీపా తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags; Farmers should be made aware of crops in Punganur – Adi Lakshmanayak

Natyam ad