ఆర్టీసీ బస్సులో  మహిళ ప్రసవం-తల్లి బిడ్డ క్షేమం

అనంతపురం ముచ్చట్లు:
 
అనంతపురం జిల్లా మడకశిర గ్రామానికి చెందిన  గీత  నిండు గర్భిణీ  హిందూపురం నుండి కదిరి కి ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో  మధ్యలో గోరంట్ల దాటిన మూడు కిలోమీటర్లు తరువాత మహిళకు ఉన్న ఫలానా తీవ్రస్థాయిలో నొప్పులు వచ్చాయి.  తరువాత  ఆమె బస్సు లొనే మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంట ఎవరూ లేకపోవడంతో ఆర్టీసీ  బస్సు డ్రైవర్ లక్ష్మీనారాయణ కండక్టర్ మారెప్ప వెంటనే స్పందించి 108 సమాచారం ఇవ్వగా గోరంట్ల వాహనం అప్పటికే మరొక కేసులో ఉన్నందువలన ఓబులదేవరచెరువు 108 రావడానికి లేట్ కావడంతో ఆర్టీసీ సిబ్బంది ఉన్నత అధికారులకు సమాచారంఅందించారు .మానవతా దృక్పథంతో ఆలోచించిన ఉన్నతాధికారులు వెంటనే ఆర్టీసీ బస్సులో  దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ఆదేశించారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ హుటాహుటిన ఆర్టీసీ బస్సులోనే ప్రసవం అయిన మహిళను కొంతమంది మహిళలు సహకారంతో గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి వెంటనే ఆసుపత్రిలో చేర్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తల్లి బిడ్డను 108 వాహనంలో ఆమె సొంత గ్రామానికి పంపించారు. ఈ సందర్భంగా  ప్రజలు కండక్టర్ ను  డ్రైవర్ ను అభినందించారు.
 
Tags; Female childbirth-mother child welfare on RTC bus

Natyam ad