Fertility to agriculture

వ్యవసాయానికి పెద్దపీట 

-బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఈటల
Date:15/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు బడ్జెట్లో పెద్ద పీట వేసామని అ్నారు. సాగునీటిశాఖకు మరోసారి 25 వేల కోట్లు, వ్యవసాయ శాఖకు 15 వేల కోట్ల 870 కోట్లు ఇచ్చినట్లు అయన చెప్పారు. దేశంలోని తొలిసారిగా ప్రవేశపెడుతున్న రైతు పెట్టుబడి పథకానికి 12 వేల కోట్లు ప్రకటించారు. తెలంగాణ మొత్తం బడ్జెట్  లక్షా 74 వేల, 453 కోట్లుగా ఉంది. ఇందులో ప్రణాళిక వ్యయం లక్షా 25 వేల 454 కోట్లు కాగా.. క్యాపిటల్ వ్యయం 33 వేల 369 కోట్లు. ద్రవ్య లోటు 29 వేల  77 కోట్లు. రెవిన్యూ మిగులు 5 వేల 520 కోట్లు. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందుందని ఈటెల చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం దేశానికంటే అధికంగా ఉందన్నారు. నాలుగేళ్లలోనే ఎన్నో అద్భుతాలు సాధించామని రాజేందర్ చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని భూరికార్డుల ప్రక్షాళన తెలంగాణలో చేపట్టామని మంత్రి  అన్నారు పారిశ్రామిక రంగంలో సంస్కరణలతో పెట్టుబడులు భారీగా పెరిగాయని తెలిపారు.గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని, నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతుల మధ్య సమన్వయం కోసం… రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. అణగారిన వర్గాల అభివృద్ధికి పెద్ద పీట వేశామని అన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ హైలైట్స్…
బడ్జెట్ – రూ. 1,74,453 కోట్లు
• రెవెన్యూ వ్యయం – రూ. 1,25,454 కోట్లు
• రాష్ట్ర ఆదాయం – రూ. 73,451 కోట్లు
• కేంద్ర వాటా – రూ. 29,041 కోట్లు
• రెవెన్యూ మిగులు – రూ. 5,520 కోట్లు
• ద్రవ్యలోటు అంచనా – రూ. 29,077 కోట్లు
గత ఏడాది తలసరి ఆదాయం అంచనా – రూ. 1,75,534 కోట్లు
• ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ వృద్ధి అంచనా – 10.4 శాతం
• సాగునీటి ప్రాజెక్టులకు – రూ. 25 వేల కోట్లు
• కోల్డ్ స్టోరేజీ, లింకేజీలకు – రూ. 132 కోట్లు
• మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు – రూ. 1000 కోట్లు
• ఆసరా పెన్షన్లకు – రూ. 5300 కోట్లు
• ఆరోగ్య లక్ష్మి పథకానికి – రూ. 298 కోట్లు
• హహిళా, శిశు సంక్షేమానికి – రూ. 1,799 కోట్లు
• ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి – రూ. 9,693 కోట్లు
• ఎస్సీ అభివృద్ధి శాఖకు – రూ. 12,709 కోట్లు
• ఎస్టీల అభివృద్ధి శాఖకు – రూ. 8,063 కోట్లు
• దళితుల భూ పంపిణీకి – రూ. 1,469 కోట్లు
• డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు – రూ. 2,643 కోట్లు
• మైనార్టీల సంక్షేమానికి – రూ. 2వేల కోట్లు
• అమ్మ బడి పథకానికి – రూ. 561 కోట్లు
• పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు – రూ. 15,563 కోట్లు
వరంగల్ నగర అభివృద్ధికి – రూ. 300 కోట్లు
• పట్టణాభివృద్ధికి – రూ. 7,251 కోట్లు
• రోడ్లు భవనాల శాఖకు – రూ. 5,575 కోట్లు
• పంట పెట్టుబడి పథకానికి – రూ. 12వేల కోట్లు
• రైతు బీమా పథకానికి – రూ. 500 కోట్లు
• వ్యవసాయం, మార్కెటింగ్ కు – రూ. 15,780 కోట్లు
• పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కు – రూ. 120 కోట్లు
• సాగునీటి ప్రాజెక్ట్ లకు – రూ. 25వేల కోట్లు
• పరిశ్రమలు, వాణిజ్య శాఖకు – రూ. 1,286 కోట్లు
• ఐటీ శాఖకు – రూ. 289 కోట్లు
• చేనేత, టెక్స్ టైల్ రంగానికి – రూ. 1,200 కోట్లు
• ఆరోగ్యలక్ష్మి పథకానికి – రూ. 298 కోట్లు
• మిషన్ భగీరథకు – రూ. 1,801 కోట్లు
• మిషన్ కాకతీయకు – రూ. 25వేల కోట్లు
• సాంస్కృతిక శాఖకు – రూ. 2వేల కోట్లు
• యాదాద్రి అభివృద్ధికి – రూ. 250 కోట్లు
• వేములవాడ దేవాలయం అభివృద్ధికి – రూ. 100 కోట్లు
• బాసర ఆలయ అభివృద్ధికి – రూ. 50 కోట్లు
• ధర్మపురి ఆలయ అభివృద్ధికి – రూ. 50 కోట్లు
• భద్రాచలం ఆలయ అభివృద్ధికి – రూ. 100 కోట్లు
• అర్చకుల జీతభత్యాలకు – రూ. 72 కోట్లు
• హోంశాఖకు – రూ. 5,790 కోట్లు
• పౌరసరఫరాల రంగానికి – రూ. 2,946 కోట్లు
• విద్యుత్ రంగానికి – రూ. 5,650 కోట్లు
• వైద్య ఆరోగ్యశాఖకు – రూ. 7,375 కోట్లు
• విద్యాశాఖకు – రూ. 10,830 కోట్లు
• గురుకులాలకు – రూ. 2,823 కోట్లు
•  ఎంబీసీల అభివృద్ధికి – రూ. 1,000 కోట్లు
•  రజకుల ఫెడరేషన్ కు – రూ. 200 కోట్లు
•  నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ కు – రూ. 250 కోట్లు
•  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు – రూ. 1,450 కోట్లు
•  వ్యవసాయ యాంత్రీకరణకు – రూ. 522 కోట్లు
•  బిందు, తుంపర సేద్యానికి – రూ. 127 కోట్లు
•  భూ రికార్డుల ప్రక్షాళనకు ధరణి వెబ్ సైట్
•  కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి – రూ. 109 కోట్లు
•  జర్నలిస్టుల సంక్షేమానికి – రూ. 75 కోట్లు
•  బ్రాహ్మణుల సంక్షేమానికి – రూ. 100 కోట్లు
•  చేనేత, జౌలి రంగానికి – రూ. 1,200 కోట్లు
•  గురుకులాలకు – రూ. 2,823 కోట్లు
•  గ్రామీణ స్థానిక సంస్థలకు – రూ. 1,500 కోట్లు
•  సీజీఎఫ్ కు – రూ. 50 కోట్లు
Tags: Fertility to agriculture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *