Festive festival in a zealous atmosphere

ఉత్సాహపూరిత వాతావరణంలో పతంగుల పండుగ

Date: 14/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో అంతర్జాతీయ పతంగుల పండుగ శనివారం ఇక్కడ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైనది. మూడు రోజులపాటు సాగే ఈ అద్భుత ఘట్టాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి చందూలాల్, శాసన మండలి మండలి ఛైర్మన్ డాక్టర్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రంగు రంగుల పతంగులు, రక రకాల ఆకృతులు నింగీ నేలను కలుపుతూ రివ్వున ఆకాశానికి ఎగిరాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన పతంగుల పోటీదారులతో పరేడ్ మైదానమంతా కోలాహలంగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఆహ్లాదాన్ని పంచుతోంది. భారీ గాలిపటాల సందడితో అంతర్జాతీయ పతంగుల ఉత్సవం వైభంగా కొనసాగుతోంది. పదపదవే వయ్యారి గాలి పటమా అంటూ అలనాటి సినిమాల సందడి మొదలు, నిన్నటి చంద్రముఖిలో గాలిపటమా పద పద పదా హంసలాగా పదపద అంటూ సాగిన పాటల్లో గాలిపటం విశిష్టతను తెలిపేవి ఎన్నో ఎన్నోన్నో. తోక ఊపుకొంటూ వయ్యారంగా నింగిని తాకే గాలిపటాల సొగసుచూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతుంటారు. అలాంటిది వందలాది గాలి పటాలను ఒక్కచోట చూడటం నిజంగా ఓ అద్భుతమే. అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని నిర్వహించటం ఇది మూడో సారి కాగా ఈ ఏడాది సింగపూర్, థాయిలాండ్, కొరియా, జపాన్, చైనా సహా మొత్తం పది దేశాల నుంచి కైట్ ఫ్ల‌య‌ర్స్‌ బృందాలు, భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి 40కైట్ ఫ్ల‌య‌ర్ బృందాలు పాల్గొనటం విశేషం. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Tags: Festive festival in a zealous atmosphere

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *