మిషన్ భగీరధతో పాటే ఫైబర్ నెట్ వర్క్

Date:16/04/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
రోజురోజుకూ టెక్నాలజి తీస్తున్నది. ప్రస్తుతం ప్రతి పనికీ నెట్ సేవలు తప్పనిసరి అవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రై వేట్ సంస్థల సేవలూ వాటి ఆధారంగానే సాగుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లోనూ వినియోగం పెరిగింది. ప్రభుత్వం నెట్‌సేవలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి పల్లె పాలనలో పారదర్శకతను పెం చేందుకు పెద్దపీట వేస్తున్నది. పింఛన్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, పహనీలు, వివిధ కార్పొరేషన్‌ల ద్వా రా అమలు చేస్తున్న రుణాల దరఖాస్తులు, ఉపాధి కూలీల వేతనాలు చెల్లింపులు, రేషన్ సరుకుల పం పిణీ ఇలా అన్నిరకాల సేవలకు నెట్ తప్పనిసరైంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యతో సేవలకు అంతరాయం కలుగుతుంది. దీంతో అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నెట్ సిగ్నల్స్ కోసం ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కుతున్నారు. జి ల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 1819 గ్రామాలను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు 194.13 కోట్లు మంజూరు కాగా, సుమారు 2804.18 కిలోమీటర్ల వరకు కేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సు మారు 1100 కిలో మీటర్ల వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతుండగా, డిసెంబర్‌కల్లా ఇంటింటికీ నల్లా నీటితో పాటు బ్రాడ్ బ్యాం డ్ సేవలు సైతం అందుబాటులోకి రానున్నాయి.  ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ, వైద్య పరమైన సిబ్బందికి ట్యాబ్‌లను అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సైతం డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తోంది. గ్రా మీణ ప్రాంతాల్లోని వైద్య సదుపాయాలు, అక్కడ అందుతున్న సేవలు, ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన చేసి పట్టణ ప్రాంతాల్లో ప్రధాన దవాఖానలతో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. భూ సంబంధించిన సమస్యలను కూడా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకొని ప రిష్కరించే ప్రక్రియ చేపడుతోంది. ఈ క్రమంలో గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్‌తోపాటే విస్తరిస్తున్న నెట్‌సేవలు ఎంతో ముఖ్యం కానున్నాయి.
Tags;Fiber network with mission terrain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *