ఢిల్లీలో కాల్పులు… ఐదుగురి అరెస్టు…

న్యూఢిల్లీ ముచ్చట్లు :
దేశ రాజధాని నగరంలో మంగళవారం జరిగిన కాల్పులు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. ద్వారక మోర్ మెట్రో స్టేషన్ సమీపంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు అక్కడికి వెళ్ళారు. స్టేషన్ సమీపంలోని ఓ భవనంలో దుండగులు ఉన్నారు. ఆ భవనాన్ని ఢిల్లీ-పంజాబ్ పోలీసులు చుట్టుముట్టారు. ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 13 పిస్టళ్ళు, 100 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.నైరుతి ఢిల్లీ డీసీపీ శిబేష్ సింగ్ మాట్లాడుతూ నివాస ప్రాంతంలో కాల్పులు జరిగినప్పటికీ ఎవరూ గాయపడలేదన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. దుండగుల నుంచి 13 తుపాకులను, 100 కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ దుండగుల కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. వీరిపై హత్య, హత్యాయత్నం, కార్జాకింగ్ వంటి ఆరోపణలు ఉన్నట్లు వివరించారు.
ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం మెట్రో స్టేషన్ వద్దనున్న ఓ భవనంలోని వ్యక్తులపైకి బయటి నుంచి ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు, ఆ తర్వాత భవనంలోని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందింది. ఢిల్లీ-పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఈ దుండగులను అరెస్టు చేశారు.
Tag :Fifteen arrested


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *