Fight with people for self-rule!

స్వయం పాలన కోసం ప్రజలతో కలిసి పోరాటం!

Date: 06/01/2018

అహ్మదాబాద్‌ ముచ్చట్లు:

బల్వంతరాయ్‌ మెహతా… ఈ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది పంచాయతీరాజ్‌ వ్యవస్థ. ఆయన నాయకత్వంలో భారతదేశంలోని గ్రామస్వరాజ్యం విరాజిల్లిందనడంలో అతిశయోక్తిలేదు. గుజరాత్‌ రెండవ ముఖ్యమంత్రిగానే కాకుండా సాహసోపేతమైన స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త, పంచాయితీరాజ్‌ (స్థానిక ప్రభుత్వ) భావన మార్గదర్శకుడుగా కూడా మెహతా ఖ్యాతినార్జించాడు. ఇతను బర్డోలి సత్యాగ్రహ సైనికుడు. రాచరిక రాష్ట్రాల రంగపు స్వయం పాలన కోసం ప్రజల పోరాటంలో ఇతని అత్యుత్తమ సహకారం ఉంది. ఇతని పేరు సుస్పష్టంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా బల్వంతరాయ్‌ మెహతా కమిటీ సిఫార్సులు ఆధారంగా దేశంలో అమలు పరచబడి బాగా ప్రాచుర్యం పొందిన పంచాయితీరాజ్‌ అనే విప్లవాత్మక కార్యక్రమంతో ఇతను ఖ్యాతి పొందాడు. స్వాతంత్య్రం తరువాత ఇతను భారతదేశం లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఇతను పార్లమెంట్‌ అంచనా కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతను ప్రణాళిక ప్రాజెక్ట్స్‌ కమిటీ అధ్యక్షుడుగా భారతదేశంలోని రాష్ట్రాలలో మూడు అంచెల వ్యవస్థ స్థాపన కోసం మెరుగైన విధానానికి ఒక అద్భుతమైన నివేదికను ప్రవేశపెట్టారు. అందువలన ఇతను భారతదేశపు పంచాయితీ రాజ్‌ ఫాదర్‌గా ప్రశంసించబడ్డాడు. ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్‌ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్‌ జనరల్‌ రిప్పన్‌ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌ కాగా, 1959 నవంబర్‌ 1న, ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే రెండవదిగా, మహబూబ్‌నగర్‌ జిల్లా, షాద్‌నగర్‌లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌గా ఏర్పడింది. 1986లో బ్లాకు స్ధాయి వ్యవస్థని మండల పరిషత్‌గా మార్చారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా వుంది. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలోని అటువంటి మంత్రిత్వ శాఖలతో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏప్రిల్‌ 24ని పంచాయతిరాజ్‌ దినంగా పాటిస్తున్నారు. ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న పంచాయితీ రాజ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 537 జిల్లా పరిషత్‌లు, 6,097 మండల పరిషత్‌లు, 2,34,676 గ్రామ పంచాయితీలు పనిచేస్తున్నాయి. పరిశోధన, శిక్షణ, విద్యాబోధన కోసం కేంద్ర స్థాయిలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ , రాష్ట్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి అకాడమీ పనిచేస్తున్నాయి. ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తుంది.

మొండి బకాయిలే ప్రధాన సమస్య: ఎస్‌బిఐ

నిర్థరక ఆస్తుల సమస్య ఈ ఏడాదిలో కనీసం మూడు త్రైమాసికాల వరకూ కొనసాగుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఈ ఏడాది చివరి వరకూ ఈ సమస్య ఉంటుందని, గత రెండు సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తోన్న నిరర్థక ఆస్తుల సమస్యతో తీవ్ర ఒత్తిడిని తమ బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొందని ఆమె ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడే ఈ సంక్షోభం నుంచి విముక్తి పొందడం సాధ్యపడదని తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన నాటికే ఈ సమస్య తీవ్రంగా ఉందని దేశంలో అతి పెద్ద బ్యాంక్‌ అయిన ఎస్‌బిఐ అధినేత్రి వివరించారు. ఈ ఏడాది మధ్యలోనే ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందని తాను తొలుత అంచనా వేసినప్పటికీ ఇప్పటి పరిస్థితులలో ఇది ఇప్పట్లో సమసిపోయే సమస్యగా కనిపించడం లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఎన్నికల తరువాత కొంత పరిస్థితి మెరుగు పడవచ్చునని, మొత్తం మీద ఈ ఏడాది చివరిలో ఈ సమస్య పరిష్కారం కావచ్చునని తెలిపారు. జడిపి వృద్ధిలో ఉంటే దీనికి సంబంధించి ఒత్తిడి తగ్గుతుందని, అప్పటివరకూ ఇబ్బంది ఉండనే ఉంటుందని వివరించారు. ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు కోసం నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణ అవసరమని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు సంబంధించిన కేబినెట్‌ కమిటీ వారు ఇటీవల జారీ చేసిన కొన్ని అనుమతుల వల్ల మార్చి నాటికి లోన్‌ డిమాండ్‌లో మెరుగుదల ఉంటుందని అన్నారు. గత జూన్‌ నుంచి కేంద్రం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు అనుమతిని ఇచ్చారు. మొండిబకాయిల వల్ల, రుణాల ఎగవేతదారుల వల్ల బ్యాంక్‌లు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని అరుంధతీ తెలిపారు. గత అక్టోబర్‌ చివరిలో ఆమె ఎస్‌బిఐ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ తాను పెద్దగా పరిస్థితిని చక్కదిద్దలేకపోయానని ఆమె అంగీకరించారు. ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉండటమే దీనికి కారణమని, పరిస్థితులను బట్టే ఆర్థిక అంశాలు ఉంటాయని, దీనిపై అద్బుతాలకు వీలుండదని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి దిగజారడం, రుణాల చెల్లింపులు సరిగ్గా లేకపోవడంతో ప్రత్యేకించి జాతీయ బ్యాంక్‌లకు ఇబ్బందులు తలెత్తాయి.

Tags: Fight with people for self-rule!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *