ఘర్షణలో మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం-ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

మంత్రాలయం ముచ్చట్లు:
 
మంత్రాలయం నియోజకవర్గం కామవరం గ్రామంలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన వారి కుటుంబాలకు  యంఎల్ఏ. బాలనాగిరెడ్డి  ప్రత్యక చొరవ తీసుకుని  ప్రభుత్వముచే ఆర్థిక సాయం అందేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని వైకాపా నాయకులు ప్రధీప్  రెడ్డి పేర్కొన్నారు. ఘర్షణ లో మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైకాపా యువనేత ప్రదీప్ రెడ్డి బుధవారం కామవరంలో బాదిత ఇంటికి చేరుకుని పరామర్శించి చెక్కును అందజేశారు. మా కుటుంబం పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికీ 825000రూపాయల ప్రకారం ఆర్థికసాయం లో భాగంగా 412500రూపాయల ప్రకారం రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అంజేశారు.
మృతిచెందిన కుటుంబ సభ్యులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి,  ఇంటి స్థలం పట్ట మరియు ప్రభుత్వ ఇల్లు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,తహశీల్దారు కార్యాలయంలో ఉద్యోగికి సమానంగా 5000 పెన్షన్,
మరియు వారి కుటుంబంలో చదువుకునే పిల్లలకు ఇంటర్ వరకు ఉచితంగా చదదువు చెప్పిస్తామన్నారు.  గాయపడ్డవారికికూడా మెడికల్ సర్టిఫికేట్ ఆదారంగా ప్రభుత్వం తరుపున సహాయం అందిస్తున్నట్టు ఎమ్మెల్యే  తెలిపారు,
 
 
 
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ప్రదీప్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రభుత్వం అందించిన సహయధనం చెక్కును మృతుల కుటుంబ సభ్యులకు అందించారు, అంతే కాకుండా ప్రభుత్వం అందించే అన్ని సహాయాలతో పాటు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి  స్వంతసహయర్థం కుటుంబానికీ 50000 చొప్పున అందించారు, జిల్లా ట్రైనీ కలెక్టర్, డీడీ వెల్ఫేర్,ఆర్డీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు మా జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ ఘటన జరిగిన వారంరోజుల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇంకా వారికి కావలసిన సహాయాన్ని మన వంతు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటామని సూచించారు,ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి,ప్రదీప్ రెడ్డి, ఆర్డీఓ, ఎమ్మార్వో, మృతుని ఇంట్లోకి వెళ్లి వారిని పరామర్శించి దైర్యంగా ఉండాలని మేమందరం మీకు అండగా ఉంటామని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల నాయకులు కృష్ణం రాజు,దేశాయ్ కృష్ణ, సీనియర్ నాయకుడు వీరసెనారెడ్డి నాగరాజగౌడ, మాబుసాబు, రామనగౌడ, గురునాథ్ రెడ్డి,పాండురంగ రెడ్డి,వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Tags; Financial assistance to the families of those killed in the clash-MLA Balanagireddy

Natyam ad