తిరుపతిలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర సర్వసభ్య సమావేశం

తిరుపతి ముచ్చట్లు:

 
తీరప్రాంత సంరక్షణే ధ్యేయంగా, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నేడు తిరుపతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో పాల్గొని మార్గదర్శనం చేయటానికి విచ్చేసిన అఖిల భారత సీమ సురక్షా సహ ప్రముఖ్ మాన్యశ్రీ మురళీధరన్ జీ గారు తదితర సభ్యులతో కలిసి బిజెపి తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు డా. చంద్రప్ప గారు నేటి తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.అనంతరం తిరుపతి పట్టణంలోని విశ్వం హైస్కూలు నందు నిర్వహిస్తున్న మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోలంగారి పోలయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పరిమెళ్ళ శ్రీనివాసరావు గారు తదితర సభ్యులతో కలిసి పాల్గొని తీరప్రాంత సంరక్షణకు, మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
 
Tags: Fisheries Welfare Committee State Plenary Meeting in Tirupati

Natyam ad