Natyam ad

మత్స్యకారులు సమన్వయంతో వేట సాగించాలి

-రాష్ట్ర మత్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
 
విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ జిల్లా మత్స్యకారులు సమన్వ యంతో చేపల వేట సాగించుకోవాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు.విశాఖ కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ లతో కలిసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ. చట్ట పరిధిలో నియమ నిబంధనలను అనుసరిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా మత్స్య కారుల అందరూ జీవనానికి ఆధార మైన వేటను కొనసాగించాలని మంత్రి కోరారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను చేప ట్టాలని,వారికి మరిన్ని సంక్షేమ పథకా లు తెచ్చేందుకు ఆలోచన చేస్తున్నార న్నారు.రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారు లతో టెక్నికల్ కమిటీని వేశామని మెరైన్ ఫిషరీస్ రెగ్యులర్ యాక్ట్ ప్రకారం బోట్లు ఉన్నవారందరూ వేట సాగించడానికి,వలలకు సంబంధించి కూడా లైసెన్సులు పొందాలని చెప్పా రు.రాష్ట్ర పరిపాలన రాజధాని గా రూపొందే విశాఖను గతం వలె శాంతియుతంగా ఉంచాలన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Fishermen must hunt in coordination