అశోక్‌బాబు కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన మాజీ ముఖ్య మంత్రి  చంద్రబాబు

అమరావతి ముచ్చట్లు:
 
తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు అరెస్ట్‌పై కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మట్లాడిన పార్టీ అధినేత వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు.అశోక్‌బాబు సతీమణికి లోకేష్ ఫోన్.మరోవైపు ఎమ్మెల్సీ అశోక్ బాబు సతీమణితో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడారు.  కనీస సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో ఆపి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని లోకేష్‌కు అశోక్ బాబు సతీమణి  వివరించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
 
Tags: Former Chief Minister Chandrababu spoke on the phone with Ashok Babu’s family members

Natyam ad