Former Minister Madras passes away

మాజీ మంత్రి మాదాల జానకిరాం కన్నుమూత

Date : 06/12/2017 
ఉదయగిరి ముచ్చట్లు:
మాజీ మంత్రివర్యులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మాదాల జానకిరాం బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ కు తరలించేందుకు రేణిగుంట విమానశ్రయానికి వెళుతుండగా మార్గమధ్యలో  కన్నుమూశారు. ఆయన పార్ధివదేహాన్ని నెల్లూరు అయ్యప్పగుడి ప్రాంతంలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగార్జున సాగర్ జలాలను ఉదయగిరి ప్రాంతానికి తెచ్చేందుకు 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మాదాల మరణంతో ఉదయగిరి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నేతలు మాదాల మరణంపై సంతాపం తెలిపారు.
Tags : Former Minister Madras passes away


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *