మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య కన్నుమూత

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం
Date:14/02/2018
ఏలూరు  ముచ్చట్లు:
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య(92)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తణుకులోని స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బోళ్ల బుల్లి రామయ్య నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. టీడీపీ సీనియర్‌ నేత బోళ్ల బుల్లిరామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. బుల్లి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే బుల్లిరామయ్య మృతికి మంత్రులు నారా లోకేష్, కళావెంకట్రావు, కామినేనిశ్రీనివాస్, నారాయణ, అచ్చెన్నాయుడు, పత్తిపాటిపుల్లారావు, కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు సంతాపం తెలిపారు. రామయ్య మృతిపట్ల పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.బొళ్ళ బుల్లి రామయ్య మృతి రాష్ట్రానికి తీరని లోటనిమంత్రి కామినేని అన్నారు. బుల్లి రామయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Tags: Former Union Minister Bulli Ramiiah passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *