రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి

అలుగునూరు ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీలోని కృష్ణానగర్కు చెందిన కె.రవీందర్(55) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 29న జరగబోయే తన కుమారుడి వివాహం కోసం ఆయన, ఆయన భార్య సరిత(45) తమ బంధువులకు పెళ్లికార్డులు ఇ చ్చేందుకు హైదరాబాద్ వచ్చారు. అనంతరం ఇద్దరు బంధువులను తీసుకొని హైదరాబాద్ నుంచి కరీంనగర్కు బయలుదేరారు. అలుగునూరు దగ్గరకు రాగానే కారు అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
Tag : Four dead in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *