Four killed in road accident

 రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Date:14/09/2018
సిద్దిపేట ముచ్చట్లు :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని రిమ్మన గూడ దగ్గర శుక్రవారం మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న టాటా ఏస్ వాహనం రోడ్డు పక్కన ఆపుతుండగా వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది. దాంతో టాటా ఏస్ తుక్కు తుక్కయింది.
దాంట్లో  ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా మండలం మర్కుక్ పాములపర్తి గ్రామానికి చెందినవారు.
క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భాదితులంతా బంధువు చావుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో టాటా ఏస్ లో 15 మంది ప్రయాణిస్తున్నారు.
Tags:Four killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *