Four lives on the lorry-ambulance

 లారీ-అంబులెన్స్ ఢీ నలుగురు సజీవదహనం

Date:09/12/2017
కోల్కతాముచ్చట్లు:
మెడికల్ క్యాంపు కోసం అంబులెన్స్లో వెళ్తున్న ఓ వైద్య బృందాన్ని మృత్యువు లారీ రూపంలో కాటేసింది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం అయ్యారు. ఒకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పశ్చిమ్బంగాలోని ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.నలుగురు వైద్యులు ఓ మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు బయల్దేరారు. ఇంతలో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ వీరి అంబులెన్స్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అంబులెన్స్లో ఉన్న నలుగురూ సజీవదహనం అయ్యారు. అందులో వైద్యులు, నర్సులు ఉన్నారు. ఆ సమయంలో అంబులెన్స్లో రోగులెవరూ లేరు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్లోని వ్యక్తిని కాపాడారు. అనంతరం ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
Tag: Four lives on the lorry-ambulance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *