Free cabs today in Hyderabad

హైదరాబాద్ లో నేటి రాత్రి ఉచిత క్యాబ్ లు

Date;31/12/2017

హైదరాబాద్ ముచ్చట్లు:

కొత్త సంవత్సర వేడుకల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ నడుంబిగించింది. కొత్త ఏడాది వేడుకలు ముగిసిన అనంతరం చోటుచేసుకునే ప్రమాదాలను నివారించేందుకు ‘హమ్‌ ఆప్‌కా సాత్‌ హై’ అంటూ ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ఉచితంగా క్యాబ్‌ సర్వీసులను అందించనున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ సేవలను అందించనున్నట్లు తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల అనంతరం మద్యం మత్తులో మునిగి తేలుతున్నవారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొత్తం 300 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉచిత సేవల కోసం 91776 24678, 88970 62663 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా ఫోన్‌ చేస్తే వారి దగ్గరికే క్యాబ్‌లను పంపిస్తామన్నారు.

Tags:Free cabs today in Hyderabad


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *