Free education for all children

పిల్లలందరికి ఉచిత విద్య అందించాలి

-ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి

Date:20/05/2018

తెలంగాణ ముచ్చట్లు :

ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని జై స్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రభుత్వాలు 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని పేర్కొందని ఆయన గుర్తు చేశారు. సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే అందరికి ఏకీక్రుత ఉచిత విద్యను అమలు చేయాలని, ఇందుకోసం అన్ని ప్రైవేట్ పాఠశాలలను జాతీయం చేయాలని కాసాని డిమాండ్ చేశారు. రెండు రాష్ర్టాలు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేసేవరకు నిరంతర ఉమ్మడి పోరాటాలు చేస్తామని జనవాహిని పార్టీ అధ్యక్షుడు డి. వి. ఎస్ ప్రసాద్ బాబు అన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాదు లోని ముసారంబాగ్ చౌరస్తా వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, తెలంగాణ ఆటో డ్రైవర్స్ సంక్షేమ సంఘం, జనవాహిని పార్టీలతో కలిసి జై స్వరాజ్ పార్టీ ఆదివారం ఆందోళన చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, గిరిజన విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గణేశ్ నాయక్, తెలంగాణ ఆటో డ్రైవర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్, జై స్వరాజ్ పార్టీ నాయకులు జి. మధుసూదన్, స్వామి, అంజయ్య, ఎల్ ఎం ఎస్ గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Free education for all children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *