స్నేహితుడి కుమార్తె వివాహానికి వెళుతు నెల్లూరు రైల్వేస్టేషన్లో…

మచిలిపట్నం ముచట్లు:

స్నేహితుడి కుమార్తె వివాహానికి వెళ్లిన ఓ వ్యక్తి రైల్వేస్టేషన్లో గుండెపోటుకు గురై మృతి చెందిన విషాద సంఘటన శనివారం నెల్లూరులో జరిగింది. అయితే భర్త మరణవార్త విని భార్య రాజేశ్వరి హఠాన్మరణం చెందింది. ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన వ్యాపారి మురళిక్రిష్ణ ప్రసాద్‌ (79)నెల్లూరులో గల తన స్నేహితుడి కుమార్తె వివాహానికి వెళ్తూ రైల్వేస్టేషన్లో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అనంతరం తోటి ప్రయాణికులు అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ ద్వారా అతని మరణ వార్తను గన్నవరంలో ఉన్న తన భార్య రాజేశ్వరికి తెలిపారు. భర్త- మరణ వర్త విన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయి హఠాత్మరణం చెందింది. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Tag : Friend’s daughter marries at Nellore railway station


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *