జనవరి 1నుంచి పెళ్లికానుక: చంద్రబాబు

అమరావతి ముచ్చట్లు:

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో పెళ్లికానుక పథకం కింద పేదలకు ఆర్థికసాయం చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పెళ్లికి ముందు రూ.20 శాతం, పెళ్లి రోజుకు మిగతా 80శాతం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రకారం మొత్తాన్ని అందజేస్తామని స్పష్టంచేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రజా సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. డ్వాక్రా సంఘాలు తన మానసిక పుత్రికలని, ఓ ముందుచూపుతో వాటిని పెట్టినట్టు చెప్పారు. సమాజంలో మహిళలకు పురుషులతో సమాన గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటుచేసినట్టు స్పష్టంచేశారు. ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆదాయం వచ్చేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.హిజ్రాలకు రూ.1000 పింఛనుత్వరలో రాష్ట్రంలోని హిజ్రాలకు సైతం రూ.1000 చొప్పున పింఛను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇటీవల కాలంలో వరకట్నం పోయి ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిలను పెళ్లిచేసుకొనే పరిస్థితులు వస్తున్నాయని, ఇది శుభపరిణామమన్నారు. చదువు, ఆరోగ్యం, పెళ్లిళ్ల వల్ల పేదల ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చంద్రన్న బీమా ద్వారా సహజ మరణమైనా రూ.2లక్షల పరిహారం ఇస్తున్నట్టు తెలిపారు. పింఛన్లు, రేషన్ పంపిణీలో పోర్టబులిటీ తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంచేశారు. అన్న అమృత హస్తంపై 85శాతం సంతృప్తి వ్యక్తమైందన్నారు.2018లో అన్న క్యాంటీన్లు2018 సంవత్సరంలో అన్న క్యాంటీన్లు అమలులోకి తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2.53 కోట్ల మంది పేదలకు చంద్రన్న బీమా అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 24గంటల పాటు విద్యుత్తు ఇవ్వగల్గుతున్నామని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టంచేశారు. ప్రటి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తామని కుటుంబ వికాసంలో చెప్పామని, రూ.474 కోట్ల వ్యయంతో 29లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

 

Tag : From January 1 onwards: Chandrababu


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *