బోళ్ళ అంత్యక్రియలు

Date:15/02/2018
కాకినాడ ముచ్చట్లు:
మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత బోళ్ళ బులిరామయ్య అంత్యక్రియలు గురువారం నిర్వహించారు.పి.గన్నవరం మండలం మానేపల్లి వద్ద వైనతేయ నదీతీరాన గల స్మశానవాటికలో పూర్తి అధికార లంచనాలతో ఘనంగా అంత్యక్రియలు జరిగాయి.తమ ప్రియతమ నేతలు కడసారి కనులారా వీక్షించేందుకు అభిమానులు,చుట్టు ప్రక్కల గ్రామస్తులు శ్మశానవాటికు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. రాష్ర్ట మంత్రులు కామినేని శ్రీనివాస్,కె.ఎస్.జవహర్,శాసనమండలి డిప్యూటీ ఛెర్మన్ రెడ్డి సుబ్రమణ్యం,దగ్గరుండి దహనసంస్కారాలు జరిపించారు.పోలీసులు మూడురౌండ్లు గాల్లో కాల్పులు జరిపి సెల్యూట్ తెలిపిన అనంతరం బులిరామయ్య కుమారుడు బోళ్ళరాజీవ్ చితికి నిప్పంటించారు.అంతకు ముందు బులిరామయ్య భౌతికకాయంతో  తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నుండి అంతిమయాత్ర ప్రారంభించారు. బోళ్ళ స్వగ్రామమైన పెదపట్నం చేరిన అనంతరం ఆయన భౌతికకాయానికి మహిళా కమీషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి, స్దానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ,నామన రాంబాబు,తో పాటు పలువురు నేతలు,నివాళులర్పించారు.అనంతరం మానేపల్లి శ్మశాన వాటికకు అంతిమయాత్ర కొనసాగింది.బోళ్ళ బులిరామయ్య చివరికోరిక ప్రకారం మనేపల్లి శ్మశానవాటిలో వైతేయనదీతీరాన దహనసంస్కారాలు జరిపించారు.
Tags: Funeral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *