భవిష్యత్తులో 3.0

Date:03/11/2018

చెన్నై ముచ్చట్లు:

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘2.0’ (2.ఓ) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమా నవంబరు 29న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ‘2.0’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు శంకర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. దర్శకులు శంకర్, రాజమౌళి, రాజ్‌కుమార్ ఇరానీలు ఇండియన్ జెమ్స్ అని రజనీకాంత్ కొనియాడారు. ఈ సినిమా షూటింగ్ కోసం తాము ఎంతో శ్రమించామని తెలిపారు. షూటింగ్ సమయంలో తాను 12 నుంచి 14 కిలోల షూట్స్ ధరించానని, వీటిని వేసుకోని నటించడం చాలా కష్టంగా ఉండేదన్నారు. పైగా ఈ సినిమా త్రీడీలో తీస్తున్న నేపథ్యంలో ఒకే షాట్‌ను 8 నుంచి 9 షార్లు తీయాల్సి వచ్చేదన్నారు. దీంతో తాను ఓ దశలో సినిమా చేయలేనని శంకర్‌కు చెప్పేశానన్నారు. అయితే, శంకర్ మాత్రం ఈ సినిమా మీరే చేయాలంటూ ఒప్పించడంతో మళ్లీ పని మొదలుపెట్టామని తెలిపారు. ఈ సినిమా ఆలస్యానికి తాను కూడా ఓ కారణమని రజనీ తెలిపారు. షూటింగ్ మొదట్లోనే తన ఆరోగ్యం దెబ్బతినడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైందన్నారు. దీంతో నిర్మాతలు పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ చేస్తామని ఒప్పుకోవడం నిజంగా వారి గొప్పతనమని తెలిపారు. దీంతో సుమారు నాలుగు నెలలు షూటింగ్‌లో పాల్గోలేదన్నారు. ఈ సినిమా రూ.300 కోట్ల అంచనాతో మొదలై.. సుమారు రూ.550 కోట్లకు చేరిందన్నారు. నిర్మాతలు తనని నమ్మో, అక్షయ్‌ను నమ్మో ఈ సినిమా తీయలేదని శంకర్‌ను నమ్మి ఖర్చు పెట్టారని రజనీ తెలిపారు. శంకర్ ఇండియన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామరన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. ఆయనతో తాను చేస్తున్న సినిమాలు బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాయని చమత్కరించారు.

రాష్ట్రస్థాయి క్రీడలకు నలుగురు పుంగనూరు విద్యార్థులు

Tags:Future 3.0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *