అమరావతి ముచ్చట్లు:
విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజికవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిడ్డి ఈశ్వరితో పాటు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశంలో చేరారు. కాగా గిడ్డి ఈశ్వరి చేరికతో ఇప్పటివరకూ 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో వలసలు ఊపందుకున్నాయి. కాగా వైయస్ఆర్ సీపీకీ చెందిన మరోక ఎంపి, ఐదు మంది ఎమ్మల్యేలు టీడీపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
Tag: Gaddi Ishwari, MLA joining TDP