దొంగల ముఠా అరెస్ట్.

-రూ 3.65 లక్షలు విలువ చేసే బంగారూ నగలు మోటార్ వాహానాలు స్వాధీనం.
-వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్.
బద్వేలు ముచ్చట్లు:
కడప ప్రకాశం నెల్లూరు జిల్లాలో అనేక దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ 3.65 లక్షలు విలువచేసే బంగారు నగలు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలు మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ బద్వేలు అర్బన్ సీఐ రామచంద్ర విలేఖర్లకు తెలిపారు బద్వేలు మండలం ఆనంద నగర్ కు చెందిన అమ్మని ఓబులేసుఇదే మండలం చెన్నంపల్లె మెట్ట ప్రాంతానికి చెందిన అక్కి దాసరి బాబు బద్వేలు మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన కొత్తచెరువు గ్రామానికి చెందిన అమ్మని కేశవ బ్రహ్మంగారి మఠం మండలంరేకలకుంట గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తులను  అరెస్ట్ చేయడం జరిగిందన్నారు వారి వద్ద నుండి 30 గ్రాములు బరువు గల బంగారు గొలుసు 10 గ్రాముల బరువు గల బంగారం గొలుసు తొమ్మిదిగ్రాముల బరువు గల ఒక బంగారు నల్లపూసల దండ ముద్దాయిల కు చెందిన 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు చేసి వీటినిస్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు కేసు దర్యాప్తులో బద్వేల్ అర్బన్ ఎస్ ఐ లు శ్రీకాంత్ కత్తి వెంకటరమణ అత్యంత ప్రతిభ చూపినట్లు వారు తెలిపారు ముద్దాయి అందరూ ఒక గ్రూపుగా ఏర్పడినేరాలకు పాల్పడుతున్నారని ఎవరు చెప్పారు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనే ఒకే ఒక ఆశయంతో వీరందరూ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పారు గత నెల 19వ తేదీ మధ్యాహ్నం బద్వేలు పట్టణంవిద్యానగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలో బంగారు గొలుసులు లాక్కొని మోటార్ సైకిల్ పై వేగంగా వెళ్లినట్లు వారు తెలిపారు.
 
Tags:Gang of thieves arrested

Natyam ad