గౌతమ్ రెడ్డి హుందాగా రాజకీయం చేశారు -చంద్రబాబు
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారని తెలుసుకున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.చంద్రబాబు.. హైదరాబాద్‌లోని గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తక్కువ సమయంలో గౌతమ్ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ‘గౌతమ్‌రెడ్డి హుందాగా రాజకీయం చేశారు. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరం. గౌతమ్‌రెడ్డి వివాదాల జోలికి వెళ్లలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలి’ అని చంద్రబాబు చెప్పారు.
Tags: Gautam Reddy did sober politics -Chandrababu