గౌతమ్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు- నెల్లూరు ఎంపీ ఆదాల

నెల్లూరు ముచ్చట్లు:
యువనేత, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి జిల్లాకే కాదు రాష్ట్రానికి తీరని లోటని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో  సోమవారం మధ్యాహ్నం జరిగిన సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గౌతమ్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆయన రాజకీయాలకు వస్తాడని అనుకోలేదని అన్నారు. వచ్చిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తూ రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. సౌమ్యుడు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అని కితాబునిచ్చారు. జిల్లాకు, రాష్ట్రానికి పరిశ్రమలను తెచ్చేందుకు అవిరళ కృషి చేస్తున్నారని, ఇంతలోనే అకాల మృత్యువు ఆయనను తీసుకు  వెళ్ళిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం కూడా తనతో మాట్లాడారని, ఎంతో ఉల్లాసంగా ఉన్నారని, ఇంతలోనే ఆయన మృతి వార్త రావడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ఆయన మరణం నన్ను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి , కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, సయ్యద్ ఫయాజుద్దీన్, నరసింహారావు, శ్రీధర్ రెడ్డి, మైపాడు అల్లాబక్షు, మధు తదితరులు పాల్గొన్నారు.
 
Tags; Gautam Reddy’s death is a huge loss to the state – Nellore MP savings

Natyam ad