ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతం సవాంగ్

విజయవాడ   ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ గా  మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏపీపీఎస్సీ సభ్యులు, అధికారులు, సిబ్బంది చైర్మన్ను కలిసి అభినందనలు తెలిపారు.రెండున్నర ఏళ్ల పాటు ఏపీ డీజీపీగా కొనసాగిన సవాంగ్ను ఎవరూ ఊహించని విధంగా బాధత్యల నుంచి తప్పించారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఆయన స్థానంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.మూడురోజుల పాటు పోస్టింగ్ లేకుండా ఉన్న సవాంగ్కు ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈరోజు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవికాలం 2023 జులైలో ముగియనుంది.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Gautam Sawang as APPSC Chairman

Natyam ad