వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలసిన గాయిత్రిదేవి, జెఏసి అధ్యక్షుడు గురుప్రతాప్‌, రహంతుల్లా, దాస్‌.

గుత్తిముచ్చట్లు:

అనంతపురం జిల్లా , గుత్తిలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సాఆర్సీపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయిత్రిదేవి ఆధ్వర్యంలో రాష్ట్ర ఏపిసిపిఎస్‌ ఉద్యోగ సంఘాల నాయకులు గురుప్రతాప్‌, రహంతుల్లా, దాస్‌ లు కలిశారు. ఈ మేరకు సీపిఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి సీపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించినందుకు ఉద్యోగుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. సీపిఎస్‌ రద్దుపై జగన్మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైన కోర్కేల కోసం ఆహర్నిశలు పోరాటం చేసి, ఆదుకుంటామని హామి ఇచ్చారు.

Tag : Gayatri Devi who joined YS Jaganmohan Reddy


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *