గజ దొంగ మంత్రి శంకర్ అనుచరుడు ఆరెస్తు 

Date:13/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
హైదరాబాద్ నగరంలో  వరుస చోరీలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ షేక్ ఉబేద్, జఫర్ ఖాన్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు  అరెస్ట్ చేసారు. వీరిద్దరూ గజదొండ మంత్రి శంకర్ తో కలిసి నేరాలు చేస్తారని టాస్క్ ఫోర్స్ డీసీపీ చైతన్యకుమార్ తెలిపారు.  రౌడీ షీటర్ షేక్ ఉబేద్ పై రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధులో పలు కేసులు నమోదయ్యాయి. షైక్ అబేద్ ఇండ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్స్, డెకయిట్, తోపాటు పలు క్రిమినల్ ఆక్టివిటికి కి పాల్పడుతున్నాడని అయన అన్నారు. గత పది సంవత్సరాల నుంచి నేరాలకు పాల్పడుతున్న షైక్ అబేద్ పై పిడి ఆక్ట్ పెట్టినా  మార్పు రాలేదు. వరుస ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న శంకర్ ముఠా తో జత కలిసాడు. అబేద్ పై 17 అరెస్ట్ వారెంట్ లు పెండింగ్ లో ఉన్నాయి. నిందితుల నుంచి 2 కత్తులు, 29 వేల నగదు, గోల్డ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని అడిషనల్ డిసిపి టాస్క్ ఫోర్స్ చైతన్య కుమార్ తెలిపారు.
Tags: Gaza thief minister Shankar Ancharuu aster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *