Geo ... magic

జియో…మాయ

ఈనాడు.

Date : 31/12/2017

జియో… అధికారిక లెక్కల్లేవు కానీ, 2017లో భారతీయుల నోట ఎక్కువగా పలికిన మాట ఇదే  అయ్యుంటుంది. భారతీయ టెలికామ్‌ రంగాన్ని జియోకి ముందూ, తర్వాతా అని విభజించాలి. ఎందుకంటే జియో వచ్చాక మొబైల్‌ సేవల ధరలు తగ్గాయి, ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది, ఫీచర్‌ ఫోన్‌కీ 4జీ వేగం వచ్చింది. టెలికామ్‌ రంగాన్ని జియో ఎలా మార్చేసిందంటే..!
గతేడాది సెప్టెంబరులో సేవలు మొదలుపెట్టిన జియో 170 రోజుల్లో(2017 ఫిబ్రవరిలో) 10 కోట్ల చందాదారుల మార్కుని అందుకుంది. సగటున ఏడు సెకన్లకి ఒక చందాదారుణ్ని పొందుతూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకంటే కూడా వేగంగా ఆ మార్కుని అందుకుంది.
* తక్కువ ధరలకే జియో సేవలు అందించడంతో, పోటీ సంస్థలూ ధరలు తగ్గించాయి. జియోకి ముందు 1జీబీ మొబైల్‌ డేటా కనీస ఛార్జీ రూ.250 ఉండేది. జియో వచ్చాక అది రూ.10కంటే తక్కువకే వస్తోంది. ఒక్కో సెల్‌ఫోన్‌ వినియోగదారుడు రీఛార్జీకి గతేడాదితో పోల్చితే 2017లో సగటున నెలకు రూ.90 తక్కువగా ఖర్చు పెట్టాడు.
* 2017లో దేశవ్యాప్తంగా మొబైల్‌ ఫోన్లలో నెలకు సగటున వాడిన డేటా 150కోట్ల జీబీ. జియో రాకముందు అది 20కోట్ల జీబీ. మొబైల్‌ డేటా వినియోగంలో 2016లో 155వ స్థానంలో ఉన్న భారత్‌, ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌ అభివృద్ధికి డేటా కొత్త ఇంధనంగా పనిచేస్తుందంటారు ఆర్థిక నిపుణులు.
* జియో రాకతో ఛార్జీలు డేటా చుట్టూ తిరుగుతున్నాయి. వాయిస్‌ కాల్స్‌ దాదాపు ఉచితం అయ్యాయి.
* మొబైల్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 2016లో 22 కోట్లు ఉంటే 2017లో 33 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల దాదాపు యాభై శాతం. ఇంటర్నెట్‌ చూసేవాళ్లలో 80 శాతం మొబైల్‌ ద్వారానే చూస్తున్నారు.

Tags : Geo … magic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *