'Geo Prime' expiration extension?

‘జియో ప్రైమ్’ గడువు పొడిగింపు?

Date: 08/01/2018

ముంబయి ముచ్చట్లు:

ఒక ఏడాది పాటు ప్రివ్యూ ఆఫర్, వెల్‌కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అని ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్, మొబైల్ డేటా అందించిన తర్వాత రిలయన్స్ జియోకి ఓ ధర్మ సందేహం వచ్చింది. అదేంటంటే? అన్నీ ఫ్రీగా వస్తున్నాయని సిమ్ తీసుకున్న వాళ్లలో ఎంత మంది పే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు? అన్నది! అందుకే గత ఏడాది 99 రూపాయలు జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని ప్రకటించింది. పోతే పోయింది 99 రూపాయలే కదా అని చాలామంది రీచార్జ్ చేసుకున్నారు. ఇప్పుడు మార్చి 31, 2018తో ఆ జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసిపోబోతోంది. ఒకవేళ ఎవరైనా మార్చి 30, 2018న కొత్తగా జియో సిమ్ తీసుకున్నా అది మార్చి 31కి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ముగిసిపోతుంది. ఇప్పటి వరకూ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి ప్రత్యేకమైన టారిఫ్, జియో టీవీ, జియో మ్యూజిక్, జియో సినిమా వంటి వివిధ ఆప్స్ ద్వారా దాదాపు 10 వేల రూపాయల విలువైన ఉచిత సేవలు అందించబడుతూ ఉన్నాయి. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత లెక్క ప్రకారం వీటన్నింటికీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ప్రకారం జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ని రిలయన్స్ జియో సంస్థ మరో ఏడాది పాటు కొనసాగించే అవకాశం ఉంది. అంటే మరో 99 రూపాయలు వినియోగదారుని దగ్గర తీసుకుని ఇప్పుడు ఎలాగైతే ప్రత్యేకమైన టారిఫ్ అందిస్తోందో, ఎలాగైతే జియో టీవీ, మ్యూజిక్ లాంటివి ఉచితంగా లభిస్తున్నాయో వాటన్నింటినీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. ఈ మేరకు మార్చి 15వ తేదీ నాటికి ఓ ప్రకటన వెలువడొచ్చు.

Tags: ‘Geo Prime’ expiration extension?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *