హక్కులు , బాధ్యతలు గుర్తించడం అలవర్చుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
 
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు , బాధ్యతలను కూడ గుర్తించి జీవించడం అలవర్చుకోవాలని సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు సూచించారు. శనివారం ప్రభుత్వాసుపత్రిలో ఆయన న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. వైద్యసేవలపై ఆరాతీశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంటు, కరోనా వార్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.సమాజంలో ప్రజలు హక్కుల గురించి మాట్లాడుతూ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా అనేక సమయాల్లో నేరాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నియంత్రించాల్సిన ప్రజలు బాధ్యతలను విస్మరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి విధానాలకు స్వస్తి పలికి , హక్కులు, బాధ్యతలను గుర్తించి, ప్రవర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వీరమోహన్‌రెడ్డి, షమివుల్లా తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Get used to recognizing rights and responsibilities

Natyam ad