ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

లక్నో  ముచ్చట్లు:
 
ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆయోధ్య జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం దాటికి కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారులోని నుంచి వెలికితీసి దవాఖానకు తరలించారు. మృతులంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
 
Tags;Ghora road in Uttar Pradesh .. Six members of the same family were killed

Natyam ad