Gifts for different talents by the MEO

ఎంఈఓ చే విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు ప్రధానం

పెద్దపంజాణి ముచ్చట్లు : 
‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన ఆట పాటల పోటీలలో గెలుపొందిన చిన్నారులకు మండల విద్యాధికారి హేమలత బహుమతులను అందజేశారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఈఓ హేమలత అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులుగా పిలువబడుతున్న చిన్నారులలో ఆత్మన్యూనతా బావాన్ని తొలగించి, మనోధైర్యాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. సమాజంలోని విభిన్న ప్రతిభావంతులను చిన్నచూపు చూడకుండా వారిలోని ప్రతిభను గుర్తించి ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఐఈఆర్టీ లు మళ్ళీశ్వరి, విక్టర్ వరకుమార్, వివిద పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags : Gifts for different talents by the MEO


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *