ప్రియురాలు మోసం చేసిందని -సెల్ఫీ ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

కాకినాడ ముచ్చట్లు:
 
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెం లో విషాదం నెలకొంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యు వకుడు నిండు ప్రాణాన్ని తీసుకున్నా డు. సూసైడ్ చేసుకోవడానికి ముందు యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఇప్పుడు జిల్లాలో ఈ వీడియో వైరల్గా మారింది.  అయి నవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెం వాసి కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు ఆత్మహత్య తూర్పుగోదా వరి జిల్లాలోనే సంచలనంగా మారింది. తాను ఓ అమ్మాయిని ప్రేమించి మోస పోయానంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.  ప్రేమపేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటుందని శంకరరావు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పేందుకు వాట్సాప్గ్రూప్లు క్రియేట్ చేసి అన్ని గ్రూప్లో కూడా ఆ అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫొటోలు వీడియోలు షేర్ చేశాడు. ఉంగరాలు మార్చుకున్న వీడియో కూడా షేర్ చేశాడు.
శంకరరావుకు ఇప్పటికే పెళ్లి అయింద న్న ప్రచారం సాగుతోంది. ఆ అమ్మా యిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా డని.. ఇప్పుడు వాళ్లిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని ఆమెతో విడిపోయాడని స్థానికులు చెబుతున్నారు.  మొదటి భార్యతో విభేదాలు ఉన్న పరిస్థితుల్లో ఈ అమ్మాయికి కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది.భార్య ఉందన్న విషయాన్ని చెప్పకుండానే ఈ అమ్మా యిని ప్రేమించాడని.. ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయి వేరే పెళ్లికి ఒప్పుకుందని కూడా స్థానికులు అంటు న్నారు.  ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పుడు నిండు ప్రాణం పోవడం ఊరిలో తీవ్ర విషాదం నింపింది. వీళ్లిద్దరు క్లోజ్గా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Girlfriend cheated -Selfie boyfriend who committed suicide

Natyam ad