బాలికల హస్టల్ లో దూరిన యువకుడు

-బాలికపై ఆత్యాచార యత్నం
Date:15/02/2018
నాగర్ కర్నూలు ముచ్చట్లు:
నాగర్ కర్నూల్ జిల్లా  అమ్రాబాద్ మండలం మన్ననూరు లోని బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై శివ అనే యువకుడు అత్యాచార యత్నం చేశాడు. అత్యంత భద్రత ఉన్న ఆశ్రమ పాఠశాలలోకి పకడ్బందీ ప్లాన్ తో అర్దరాత్రి  12 గంటల ప్రాంతంలో గోడదూకి ప్రవేశించాడు. అనంతరం విద్యార్థినిపై అత్యాచారానికిప్రయత్నించాడు. . హాస్టల్ లోకి ప్రవేశించిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది విద్యార్థినిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన శివ అనే యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శివను అదుపులోకి తీసుకున్న అమ్రాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags: Girls are a young man hanging in the hostel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *