ఘనంగా  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

-ఆత్మ స్థైర్యమే ఆయుధం కావాలి.
-మహిళలకు మహిళలే అండగా నిలవాలి.
-సమాజ మనుగడకు మహిళే  కీలకం.
-సభలో మాట్లాడిన పలువురు వక్తలు
విజయనగరం ముచ్చట్లు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆధ్వర్యం లో జిల్లాలో ఘనంగా జరిగాయి. కల్లెక్టరేట్ ఆడిటోరియంలో కేర్ ఇండియా, ఐ.సి.డి.ఎస్ శాఖ  ద్వారా వేడుకలు నిర్వహించారు.  స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియం లో జిల్లా యంత్రాంగం తరఫున అన్ని శాఖల సమన్వయం తో నిర్వహించారు.   మహిళలకు, పిల్లలకు అవసరమగు  వ్యక్తిగత పరిశుభ్రత, బ్రెస్ట్ కాన్సర్, మానసిక సమస్యలు, వత్తిడి ని ఎదుర్కోవడం తదితర అంశాల పై సంబంధిత నిపుణులు వివరించారు.  అదే  విధంగా డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ లిటరసీ, , ముద్ర తదితర  రుణాల గురించి  బ్యాంకర్లు అవగాహన కలిగించారు.  ఈ సందర్భంగా పలు రంగాలలో ఉత్తమ సేవలు అందిసున్న మహిళలను జ్ఞాపికలతో సత్కరించారు.  ఈ సందర్భంగా మహారాజ  సంగీత నృత్య  కళాశాల విద్యార్ధుల వీణా నాదం,  సంగీత కార్యక్రమాలు, అంబేద్కర్ బాలయోగి గురుకుల పాఠశాల , చీపురుపల్లి విద్యార్ధులు ప్రదర్శించిన గేయాలు, నృత్యాలు అలరించాయి.
మహిళా భివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది:    జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు
ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక పధకాలను మహిళల అభివృద్ధి కోసం అమలు చేస్తూ  మహిళా సాధికారత కు  కట్టుబడి ఉందని అన్నారు.  నామినేటెడ్, కార్పొరేషన్  పదవుల్లో మహిళలకు 50 శాతం పై బడి అధికారాలను ఇచ్చారని పేర్కొన్నారు.  గతం లో  స్వర్గీయ ముఖ్యమంత్రి  వై.ఎస్.  రాజశేఖర్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం కృషి చేసారని గుర్తు చేసారు.  నేటి ముఖ్యమంత్రి కూడా అదే బాట లో నడుస్తూ మహిళల  సంక్షేమానికే పెద్ద పీట  వేస్తున్నారన్నారు.  ప్రస్తుత జిల్లా కలెక్టర్ సూర్య కుమారి నేతృత్వం లో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో  మహిళల సంఖ్య  మరింత పెరగాలని ఆకాంక్షించారు.
 
Tags:Glorious International Women’s Day Celebrations.

Natyam ad