ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

డోన్  ముచ్చట్లు:
అంతర్జాతీయ మహిళ దినోత్సవం ను డోన్ పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు, స్థానిక పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మంగళవారం ఉదయం ప్రధానోపాధ్యాయరాలు పద్మావతమ్మ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవంను నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో ముందు గా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు, ఆ తర్వాత వారు మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణ కోసం 14 గంటల  పనిగంటలను 8గంటలకు తగ్గించడానికి ఈ రోజునే ప్రపంచమంతా జరిగిన పోరాటం ఫలితంగా సాధించిన విజయం గా చెప్పవచ్చు.అని  ఆమె అన్నారు, మహిళలకు రక్షణ కరువైందని,దిశా చట్టం పై అవగాహన కలిగి ఉండాలన్నారు, సీనియర్ ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి, శివ ప్రసాద్, వెంకటేశ్వర్ గౌడ్, లక్ష్మయ్య, వెంకట రమణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చక్కగా చదివి ఉన్నత చదువులు పొంది మంచి ఉన్నత పదవులు పొందాలన్నారు,ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ గారికి, శాలువా
కప్పి, పూలమాల సమర్పించారు, ఈ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య రీత్యా అనేక సేవలందించిన హెల్త్ అసిస్టెంట్ సునీత, శ్రీలక్ష్మి, ఆశావర్కర్ శోభా రాణిలను  ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు  రవిశేఖర్, చంద్రశేఖర్ గౌడ్, టి.శ్రీనివాసులు, లక్ష్మి కాంత రెడ్డి,భూకాంతరెడ్డి, మద్దిలేటి,జి.సుబ్బారాయుడు,సుభాష్, మధుసూదన్ రెడ్డి,యు.శ్రీనివాసులు, జయ సుబ్బారాయుడు,రమేష్,వై.శ్రీనివాసులు, ఆదినారాయణ, దేవేంద్రప్ప, భాను ప్రకాష్ రెడ్డి,  అల్లిపీరా సురేష్, మునిరాజు, అల్లిపీరా, తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Glorious International Women’s Day

Natyam ad