వైభవంగా రాఘవేంద్ర స్వామి 427.వ. పుట్టిన రోజు వేడుకలు-టిటిడి పట్టు వస్త్రాలు సమర్పణ.

మంత్రాలయం ముచ్చట్లు:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 427.వ. పుట్టిన రోజు వేడుకలను శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంధ్ర తీర్థులు ఆధ్వర్యంలో మఠం అధికారులు  బుదవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్నికి జలాభిషేకం పంచామృతాభిషేకం గావించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున జే. ఈ. ఓ. ధర్మ రెడ్డిదంపతులు  తెచ్చిన పట్టు వస్త్రాలు మహా ద్వారం నుండి మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. మఠం అధికారులు టీటీడీ అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం టిటిడి నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలను పీఠాధిపతులు శిరస్సుపై ఉంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .టీటీడీ అధికారులు  గ్రామదేవత మంచాలమ్మ కు దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దగ్గర పట్టు వస్త్రాలును ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉంజల్ సేవ మండపంలో  ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాఘవేంద్ర స్వామి మఠానికి ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు భక్తులు ఇచ్చిన కానుక లతో4 వెండి పాత్రలను ఈరోజు స్వామి పుట్టిన రోజు సందర్భంగా వాటిని స్వామి వారి పూజలో ఉపయోగించారు.  అలాగే భక్తులు ముత్యాల బంగారు హారాన్ని రాఘవేంద్ర స్వామి బృందావనానికి  బహుకరించారు. తదనంతరం బంగారు రథోత్సవంపై శ్రీ రాఘవేంద్ర స్వామి బంగారు  ప్రతిమను ఉంచి శ్రీ మఠం ఆలయ ప్రాంగణంలో భక్తజనుల మద్య ఊరేగించారు. అనంతరం చెన్నై  నగరానికి చెందిన  500 మంది  నాగస్వరం సంగీత విద్వాంసులు చేత  శ్రీ రాఘవేంద్ర స్వామి సంకీర్తనలను అలకించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
Tags:Glorious Raghavendra Swamy 427.v. Birthday Celebrations-TTD silk dresses offering

Natyam ad