ఘనంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు

చంద్రగిరి ముచ్చట్లు:
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ శ్రీ పులివర్తి నాని గారి ఆదేశాలు మేరకు అన్ని మండలాల్లో పార్టీ నేతలు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. లోకేష్ బాబు స్వగ్రామం నారావారిపల్లిలో గ్రామస్తులు ఆయన ఇంటి ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యువనేత సారధ్యంలో పార్టీ బలోపేతం అవుతోందని, వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టి రారాజుగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, ఆర్సీపురం, తిరుపతి రూరల్ మండలాల్లో జన్మదిన వేడుకలు జరిపారు.

పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Glorious youth Nara Lokesh birthday celebrations

Natyam ad