Go slow - join the destination safely

నెమ్మదిగా వెళ్ళము – సురక్షితంగా గమ్యం చేరుము

Date:15/01/2018

– పోలీసులచే ప్ల కార్డుల ప్రదర్శన

పలమనేరు ముచ్చట్లు:

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు ప్ల కార్డులతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషను వద్ద ‘ సీఐ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో పోలీసులచే ‘నెమ్మదిగా వెళ్ళుము – సురక్షితంగా గమ్యం చేరుము’ అనే నినాదాలతో కూడిన ప్ల కార్డులతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు ట్రాఫిక్ అవేర్నెస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపంజాణిలో ఎస్సై చంద్రమోహన్ ఆద్వర్యంలో కూడా ట్రాఫిక్ నియంత్రణ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని, సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సరదాగా జరుపుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.

Tags: Go slow – join the destination safely

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *