భావితరాలకు గో ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి

తిరుపతి ముచ్చట్లు:
 
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘ‌నంగా గో పూజ‌ – టిటిడి ధర్మకర్తలు ధర్మకర్తల మండలి సభ్యులు  పోకల అశోక్ కుమార్ భావితరాలకు గో ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ పిలుపునిచ్చారు.తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆదివారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ ఉచితంగా ఎద్దులను అందిస్తున్నట్లు చెప్పారు. గోవు నుండి లభించే పంచగవ్యలను గుర్తించి, దేశ విదేశాల్లోని ప్రజలందరూ గోవులను రక్షించుకోవడం ద్వారా ఆయురారోగ్యాలతో ఉంటారని వివరించారు.టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ వందలాది సంవత్సరాలుగా గోవులకు కనుమ పండుగ రోజు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ఆధునిక యుగంలో గో ప్రాశస్త్యాన్ని మరిచిపోతున్నారని, దాన్ని తెలియజేసేందుకు టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల గో మహా సమ్మేళనం నిర్వహించిందని, దీనికి దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు హాజరై గోవు ప్రాముఖ్యతను వివరించారని చెప్పారు.అంతకుముందు గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజ చేశారు. అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు. ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.గోశాల సంచాలకులు  హరినాథ్ రెడ్డి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Go to the future to convey prestige

Natyam ad