పుంగనూరులో ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
జలుబు, దగ్గు, జ్వరము ఉందని సమాచారం వస్తే చాలు ఇంటికే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీపతి, మెడికల్ ఆఫీసర్లు రెడ్డికార్తీక్, సల్మాసుల్తాన ఆధ్వర్యంలో గ్రామాల్లోని సచివాలయాల్లో వ్యాక్సినేషన్లు, ఇంటింటికి వెళ్లి చికిత్సలు నిర్వహించి, టీకాలు వేస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ రెడ్డికార్తీక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆనారోగ్యానికి గురైతే ఇంటికే వెళ్లి చికిత్సలు చేసి, హ్గం ఐసోలేషన్, లేదా పుంగనూరు కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ 18 సంవత్సరాల లోపు వారికి 99 శాతం పూర్తి చేశామన్నారు. మూడవ డోస్ 1130 మందికి వేశామన్నారు. మండలంలో ఇప్పటి వరకు 276 మందికి పరీక్షలు నిర్వహించి, 23 మందిలో కరోనా గుర్తించి ఆసుపత్రికి తరలించామన్నారు. ఎంపిపి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజాప్రతినిధులు కలసి ఇంటింటికి వెళ్లి ఫీవర్‌సర్వే నిర్వహిస్తున్నామన్నారు. అనుమానితులను చికిత్సలకు తరలిస్తున్నామని తెలిపారు. బాధితులు ఎవరు ఆందోళన చెందకుండ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మాస్క్‌లు లేని వారికి జరిమానాలు విధించి, అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు మండలంలోని ప్రతి ఒక్కరు సిద్దంగా ఉన్నారని తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Going house to house in Punganur Corona tests -MPP Bhaskar Reddy