కడప నగరంలో సంచలనం సృష్టించిన బంగారు దుకాణం చోరీ కేసు

5 గంటల్లో చేధించిన కడప వన్ టౌన్ పోలీసులు
రూ.1.2 కోట్ల విలువైన  బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు స్వాధీనం
బాలుపల్లి చెక్ పోస్టు వద్ద చోరీకి పాల్పడ్డ గుమస్తా ను అరెస్టు చేసిన పోలీసులు
యజమాని కి టోకరా వేసి.మారు తాళం తో భారీ చోరీ

కడప ముచ్చట్లు:


కడప నగరం వన్ టౌన్ పరిధిలోని మెహతాబ్ జ్యూవెలరీ షాప్ లో భారీ చోరీ కేసును, జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ నిరంతర పర్యవేక్షణలో, కడప DSP బి.వెంకట శివారెడ్డి గారి ఆద్వర్యం లో కడప వన్ టౌన్ పోలీసులు కేవలం 5 గంటల్లో చేధించారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉన్న పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ మీడియా కు వివరాలు వెల్లడించారు. చోరీ కి పాల్పడ్డ షేక్ మసూద్ (39) అనే గుమస్తాను అరెస్టు చేసి రూ.1.2 కోట్ల విలువైన 2.66 కిలోల బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు, మూడు మారు తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్.పి. శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. కేసు

Post Midle

వివరాలు:

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన గుమస్తా.. చోరీకి పక్కా స్కెచ్..మారు తాళాలు తయారీ: నగరం నష్ కు చెందిన ముద్దాయి షేక్ మసూద్ గత 20 సంవత్సరాలు గా మెహతాబ్ జ్యూవెలరీ దుకాణంలో పనిచేస్తూ యజమాని మస్తాన్ వద్ద నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.ఈ నేపథ్యంలో ఇటీవల షేక్ మసూద్ సమీప బంధువు కు పూచీకత్తుగా ఉంటూ ఇతరుల వద్ద అప్పు ఇప్పించాడు. సమీప బంధువు అప్పు చెల్లించకపోగా మసూద్ పై అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయసాగారు. అప్పుల బారి నుండి బయట పడేందుకు పక్కా ప్రణాళిక తో స్కెచ్ వేసాడు. ప్రతి రోజు ఉదయం యజమాని మస్తాన్ ఇంటివద్దకు వెళ్లి షాప్ తాళాలు తీసుకుని షాప్ ను తెరిచేవాడు. గుమస్తా మసూద్ వచ్చిన కొద్ది సేపటికి వంచని షాప్ కు వచ్చేవాడు. అదను చూసుకునిఅసలు తాళాలకు తానే స్వయంగా మారు తాళాలు తయారు చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు యజమాని మస్తాన్, నిందితుడు మసూద్ ఇద్దరు కలిసి షాప్ కు తాళాలు వేసుకుని భోజనానికి ఇంటికి వెళ్లారు. నిందితుడు కొద్ది సేపటికి మళ్ళీ తిరిగి దుకాణం వద్ద కు వెళ్లి మారు తాళాలతో షాపు షట్టర్లను తెరిచి ర్యాకుల్లో ఉంచిన 2.66 కిలోల బంగారు ఆభరణాలను, క్యాష్ బాక్స్ లో ఉంచిన రూ.45 వేల నగదును దొంగిలించి పరారయ్యాడు.

యజమాని షేక్ మస్తాన్ 11 న మధ్యాహ్నం 3 గంటలకు భోజనానంతరం దుకాణం లోనికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే కడప వన్ టౌన్ సి.ఐ టి.వి సత్యనారాయణ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు. అరెస్టు నేపథ్యం:
నిందితుడు షేక్ మసూద్ బంగారు చోరీ చేసిన అనంతరం తిరుపతి కి వెళ్తున్నట్లు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోరైల్వే కోడూరు సమీపంలోని బాలు పల్లి చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్సు లో ఉన్న నిందితుడు మసూద్, అతని వద్ద ప్లాస్టిక్ సంచి లో ఉన్న 2668.75 గ్రాముల బంగారు ఆభరణాలను, రూ.45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

Tags: Gold shop theft case that created a sensation in Kadapa city

Post Midle
Natyam ad